సబ్బితం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.
గౌరీ గుండాల వాటర్ ఫాల్ సందర్శించిన ఎమ్మెల్యే.
పెద్దపల్లి,జులై9(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి మండలం సబ్బితం గట్టు సింగారం గౌరీ గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. సబ్బితం గౌరీ గుండాల జలపాతాన్ని పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్, స్ధానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం సందర్శించారు. జలపాతాన్ని ప్రజలు సందర్శించేందుకు వెళ్ళడానికి రోడ్డు సదుపాయం, వాటర్ ఫాల్స్ వద్ద ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్థానని హామీ ఇచ్చారు. జలపాత పరిసర ప్రాంతాల వద్ద చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. జలపాత ఆవరణలో ఉన్న ప్రభుత్వ భూమి, పర్యాటక కేంద్రం వరకు రహదారి విస్తరణకు అయ్యే ఖర్చుపై వెంటనే నివేదికలు సమర్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జలపాతం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జలపాత పరిసర ప్రాంతంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి రాంమూర్తి, నూగిల్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, సందనవేన రాజేందర్, మస్రత్, కట్కూరి సుధాకర్ రెడ్డి, ఆరె సంతోష్, కలబోయిన మహేందర్, గంట రమేష్, ప్రదీప్, చంద శంకర్, చుంచు సదయ్య, పెద్దులు, గుమ్మడి ప్రసాద్, కందుల అశోక్, కొయ్యడ సతీష్, కొయ్యడ సారయ్య గౌడ్, శ్రీకాంత్, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.