నరేంద్ర మోదీ కోసం సాహస యాత్ర చేసిన మహేష్ పటేల్
సుల్తానాబాద్,జులై9(కలం శ్రీ న్యూస్):
నరేంద్ర మోదీ కోసం కాశ్మీర్ లో అమర్ నాథ్ సాహస యాత్ర చేసి మంచు శివ లింగాన్ని దర్శించుకున్న సుల్తానాబాద్ బిజెపి యువమోర్చా అధ్యక్షులు మహేష్ పటేల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానమంత్రి కావాలి అని ఆ పరమ శివున్ని మొక్కుకున్నానని, అందుకే కాశ్మీర్ లోని అమర్ నాథ్ (సాహస) యాత్ర చేసి మంచు లింగాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నానని, 74ఏళ్ల వయస్సు మోదీ దేశం కోసం రోజు 18గంటలు పనిచేస్తారని, కలియుగంలో పుట్టిన కారణజన్ముడు మోదీ అని, ఆ మహానుభావుడి కోసం కాశ్మీర్ లోని సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే దర్శనం ఇచ్చే మంచు లింగాన్ని హిమాలయ పర్వతాలలో మంచు, వర్షం, ఎముకలు కొరికే చలిలో పహల్గామ్ నుండి అమర్ నాథ్ వరకు దాదాపు 47.3 కిలోమీటర్లు కాలినడకన ఈ సాహస యాత్ర (కఠినమైనా యాత్ర) చేసాను అని అన్నారు. అలాగే త్వరలోనే మోదీ యూ.సిసి (యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లు అమలు చేయాలి అని కోరారు.