వన మహోత్సవాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ
సుల్తానాబాద్,జులై6(కలం శ్రీ న్యూస్):
వన మహోత్సవాన్ని పెంపొందించేందుకు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. శనివారం సుల్తానాబాద్ మున్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంతో పాటు మార్కండేయ కాలనీ సమీపంలో ఉన్న నర్సరీ ని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, స్థానిక వార్డ్ కౌన్సిలర్ చింతల సునీత రాజు లతో కలిసి అశోక్ నగర్ స్కూల్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో విధిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు.చెట్ల ద్వారా ప్రజలకు ప్రాణవాయువు లభించడంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలకు అనువుగా ఉంటుందని, చెట్ల ద్వారా చక్కటి వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. త్వరితగతిన మొక్కలు నాటేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కట్ల వేణుమాధవ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శివయ్య, వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది తో పాటు వార్డు ప్రజలు పలువురు పాల్గొన్నారు.