లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జంతు సంక్రమిత వ్యాధుల అవగాహన సదస్సు
సుల్తానాబాద్ జులై 06 (కలం శ్రీ న్యూస్):
వరల్డ్ జోనోసిస్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు జంతు సంక్రమిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు స్థానిక పశు వైద్యశాల సహాయకులు మహమ్మద్ నవాబ్ జానీకి జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్,జిల్లా కో-ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ లూయిస్ పాశ్చర్ అనే సైంటిస్ట్ రాబిస్ వ్యాధి టీకాను కనుగొన్న జులై 6 1885 సంవత్సరానికి గుర్తుగా ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ జునోసిస్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారని, అలాగే ఇళ్లల్లో పెంచుకునే సాధు జంతువుల ద్వారా సంక్రమించే అనేక రకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పెంపుడు జంతువుల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ఉండడానికి క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్ ను ఇప్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మాటేటి క్రిష్ణప్రియ, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.