వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్లో నోట్ బుక్స్ పంపిణీ
సుల్తానాబాద్,జులై(కలం శ్రీ న్యూస్):
వాసవి క్లబ్ సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 120 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు వాసవి క్లబ్ సుల్తానాబాద్ వారు పంపిణీ చేయడం జరిగింది.అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ కుటుంబానికి 2016 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ వాసవి క్లబ్ ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం, విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం కొరకు విద్యార్థులు ఎనలేని కృషి చేయాలని కోరినారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాట్లాడుతూ. విద్యార్థి దశ చాలా ముఖ్యమైనది. ఈ దశలోనే విద్యార్థులు కృషి చేస్తే ఏదైనా సాధించగలరు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శారదా,వాసవి క్లబ్ అధ్యక్షులు అక్కినపల్లి సత్యనారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్. ఎల్లంకి రాజన్న ,ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి రమేష్, జోన్ చైర్మన్ సంపత్ కుమార్, వాసవి క్లబ్ సభ్యులు కొమురవెల్లి భాస్కర్,పల్లా సురేష్,కాసం భూమన్న, చకీలం వెంకటేశం,చకిలం సురేష్,ప్రసాద్, వంశీ, శ్రీనివాస్, వినయ్ కుమార్, సందీప్ కుమార్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.