Wednesday, December 4, 2024
Homeతెలంగాణబెట్టింగ్ యాప్ ముఠా అరెస్ట్ 

బెట్టింగ్ యాప్ ముఠా అరెస్ట్ 

బెట్టింగ్ యాప్ ముఠా అరెస్ట్ 

భారీగా నగదు లభ్యం

సుల్తానాబాద్,జులై4(కలం శ్రీ న్యూస్):

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, ఐజీ, అదేశాల మేరకు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఎస్సైలు లు శ్రావణ్ కుమార్,నరేష్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వాహనంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిమ్మ ధనుంజయ్, గోదావరిఖని కి చెందిన ముల్కల రాజ్ కుమార్,చిన్న పల్లి అభిలాష్ అను ముగ్గురు యువకులను పట్టుకొని ప్రశ్నించగా వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులో నుండి 33 లక్షల పదివేల రూపాయలు లభించగా,వారిని విచారించిన పిదప ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ అయిన 55 క్లబ్ , తిరంగా యాప్,82 లాటరీ అప్ ల ద్వారా బెట్టింగ్ పెడుతూ, ఆ యాప్ లను సోషల్ మీడియా ఐన ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్ ల ద్వారా ఫాలోవర్స్ కి బెట్టింగ్ యాప్స్ లింక్స్ పంపుతూ, వారిని ఆడేలా ప్రోత్సహిస్తూ, ఆ యాప్ ని ప్రజలు ఆడేలా, ప్రత్యక్షంగా వాటిని ప్రమోట్ చేస్తూ, వాటి ద్వారా ఆ డబ్బులు సంపాదిస్తున్నారని, బెట్టింగ్ యాప్ లో జమైన డబ్బును యూ.ఎస్.డి.టి ద్వారా బెట్టింగ్ యాప్ నుండి హైదరాబాదులో ఉన్న ఈ యాప్ ల ద్వారా వచ్చే డబ్బును గుర్తు తెలియని మనీ ట్రేడర్స్ ద్వారా ఆ డబ్బుని తీసుకొని  హైదరాబాదు నుండి గోదావరిఖని కి వస్తుండగా మార్గమధ్యంలో  అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు,ఇలాంటి బెట్టింగ్ ఆన్ లైన్ యాప్ ల ద్వారా డబ్బులు పోగొట్టుకోకుండా ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!