Monday, July 15, 2024
Homeతెలంగాణవాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవుల సంరక్షణకు విరాళం అందజేత

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవుల సంరక్షణకు విరాళం అందజేత

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవుల సంరక్షణకు విరాళం అందజేత

సుల్తానాబాద్, జూన్30(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవుల సంరక్షణ కోసం విరాళం అందజేశారు.ఆదివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కండేయ కాలనీ లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు విరాళం అందజేసి మరొసారి వాకర్స్ మానవత్వాన్ని నిరూపించుకున్నారు.మూగజీవాలైన గోమాతలు ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తున్నాయని వాటికి గోశాల నిర్వాహకులు రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టారు. రేకుల షెడ్డు నిర్మా ణం లో భాగంగా తమవంతు సహకారంగా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వాకర్ ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణానికి వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ డాక్టర్ ఐల రమేష్,చొప్పరి సుమన్ వాకర్స్ తో కలిసి పదివేల రూపాయల విరాళాన్ని గోశాల నిర్వాహకులకు అందజేశారు.ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు బండారి సూర్య వాకర్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి భాస్కర్,సాదుల సుగుణాకర్, పల్ల సురేష్,కామని వెంకటేశం, శ్రీకాంత్,మల్లేశం,కొలిపాక రవి,ఉల్లంగుల శ్రీనివాస్, కొమరవెల్లి శ్రీనివాస్, కాశీం, సుంక వేణు,రామచంద్రం,రామకృష్ణ, ప్రశాంత్, నల్ల మధు,  సోడా శ్రీను, ప్రభాకర్,ఎల్లయ్య, సామల విద్యాసాగర్,తోపాటు అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!