Thursday, October 10, 2024
Homeతెలంగాణఘనంగా అంతర్జాతీయ ఖో ఖో దినోత్సవం...

ఘనంగా అంతర్జాతీయ ఖో ఖో దినోత్సవం…

ఘనంగా అంతర్జాతీయ ఖో ఖో దినోత్సవం...

సుల్తానాబాద్,జూన్30(కలం శ్రీ న్యూస్):

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలోని ఖేలో ఇండియా ఖో ఖో సెంటర్ లో ఆదివారం అంతర్జాతీయ ఖో ఖో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను జాతీయ సీనియర్ ఖో ఖో క్రీడాకారుడు బైరగోని రవీందర్ గౌడ్ కట్ చేసి క్రీడాకారులకు అంతర్జాతీయ ఖోఖో దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ ఖోఖో క్రీడకు పుట్టినిల్లు అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన ఘనత సుల్తానాబాద్ కు దక్కిందన్నారు. 2036 లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఒలంపిక్స్ లో ఖోఖో క్రీడకు చోటు దక్కడం గర్వకారణం అన్నారు. అనంతరం ఆయన కిలో ఇండియా ఖో ఖో సెంటర్ కోచ్, మాజీ భారత కోకో జట్టు క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. క్రీడాకారులకు స్వీట్లు పంచి పంపినీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జాతీయ సీనియర్ ఖో ఖో క్రీడాకారులు సిలివేరి మహేందర్, ఎక్బాల్, ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్, గజబింకార్ పవన్ తో పాటు క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!