వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఇన్సులేషన్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ
డిప్యూటీ గవర్నర్ బుర్ర జగదీశ్వర్ గౌడ్
సుల్తానాబాద్, జూన్29(కలం శ్రీ న్యూస్):
శనివారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఆదివారం జరిగే వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఇన్సులేషన్ కార్యక్రమం పోస్టర్ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ డిప్యూటీ గవర్నర్ బుర్ర జగదీశ్వర్ గౌడ్,డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఎ.వెంకట్ రెడ్డి లు సుల్తానాబాద్ వాకర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాకర్స్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ వారి నిర్వహణలో అన్నమనేని గార్డెన్ కోతిరాoపూర్ లో నూతన వాకర్స్, అసోసియేషన్ ఏర్పడిన వారికి సన్మానం కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు వెంకటేశ్వర్రావు, కేసి మూర్తి, మల్లారెడ్డి, రవి, ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ డాక్టర్ ఐల రమేష్, కొమురవెల్లి భాస్కర్, యూనివర్సిటీ అథ్లెటిక్స్ క్రీడాకారుడు చొప్పరి సుమన్, వెంకటేశ్వర రావు, కొమ్ము జగన్ సంపత్ రెడ్డి,వేముల రాజమౌళి ఎలగందుల మల్లేశం, సుంక వేణు కొలిపాక రవి, తోపాటు వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.