రాష్ట్రస్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలు
సుల్తానాబాద్,జూన్29(కలం శ్రీ న్యూస్):
ఈనెల 30న ఆదివారము ఉదయం 10 గంటలకు జిహెచ్ఎంసి గౌలిపుర ప్లేగ్రౌండ్ హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టగ్ ఆఫ్ వార్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ ఎం.బ్రహ్మానందం జిల్లాకు సమాచారమిచ్చినట్లు జిల్లా కార్యదర్శులు ఆలేటి సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లా లోని ఆసక్తిగల బాలబాలికలు 13, ,15,17,19, సంవత్సరాల లోపు బాల బాలికలు ,సీనియర్స్ మహిళలు ,పురుషులు తమ బోనఫైడ్ ,ఆధార్ కార్డుతో రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనవచ్చునని, పెద్దపల్లి జిల్లా కార్యదర్శులు ఆలేటి సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో ఎంపికైన బాల బాలికలు ఆగస్టు 5 నుండి 7 వరకు ఆగ్రా, ఉత్తరప్రదేశ్ లో జరుగు జాతీయ స్థాయి క్రీడలకు పంపుతామని మిగతా వివరాలకు 98669 74147 సంప్రదించగలరని కోరారు.