Monday, July 15, 2024
Homeతెలంగాణట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఆస్తి పన్ను రేట్లు తగ్గింపు కు చర్యలు 

ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఆస్తి పన్ను రేట్లు తగ్గింపు కు చర్యలు 

ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఆస్తి పన్ను రేట్లు తగ్గింపు కు చర్యలు 

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్,జూన్28(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలపై పన్నుల భారం తగ్గించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు అన్నారు. శుక్రవారం చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు  అధ్యక్షతన నిర్వహించిన సుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, పాలకవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ప్రజలపై అధికంగా పడి ఇబ్బంది పడుతున్నారని, వాటిని తగ్గించేందుకు కృషి చేస్తామని త్వరలోనే ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా పన్నులు విధించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మున్సిపల్ పరిధిలో అన్ని హంగులతో అధునాతన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని, 11 కోట్ల రూపాయలతో సుల్తానాబాద్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, అలాగే స్థానిక తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గట్టేపల్లి క్రాసింగ్ రోడ్డు వరకు 2.8 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, త్వరలో మరిన్ని నిధులు కేటాయించి మున్సిపాలిటీకి ఆధునిక శోభను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ను సుల్తానాబాద్ మున్సిపల్ కు ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం సమావేశం పలు అంశాలపై కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పాలకవర్గ సభ్యులు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కట్ల వేణుమాధవ్,కౌన్సిలర్  తో పాటు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!