Monday, July 15, 2024
Homeతెలంగాణక్రీడా పాఠశాల ప్రవేశానికి మండల స్థాయి ఎంపిక

క్రీడా పాఠశాల ప్రవేశానికి మండల స్థాయి ఎంపిక

క్రీడా పాఠశాల ప్రవేశానికి మండల స్థాయి ఎంపిక

సుల్తానాబాద్,జూన్26(కలం శ్రీ న్యూస్):

క్రీడా పాఠశాలలు (హకీంపేట- కరీంనగర్- ఆదిలాబాద్) లో 2024-25 సంవత్సరానికి గాను నాలుగవ తరగతిలో ప్రవేశానికి బుదవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు ఏం.ఈ.ఓ సురేందర్  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి.దివాకర్, రత్నాకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ ఎంపిక పోటీలలో మండలంలోని వివిధ పాఠశాలల నుండి 25 మంది విద్యార్థులు పాల్గొనగా ఐదుగురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కాబడ్డారు. ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులు 29వ తేదీన పెద్దపల్లిలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో నూతనంగా పదోన్నతి పై వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీవాణి, ఆసియా బేగం, ప్రణయ్, వెంకటేష్ లను సుల్తానాబాద్ మండల ఎస్.జీ.ఎఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమేష్, పీడీలు సంధ్య, శ్రీవాణి, ఆసియాబేగం, ప్రణయ్, వెంకటేష్,సిఆర్పి సదానందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!