ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడి లైంగిక దాడి యత్నం
సుల్తానాబాద్,జూన్22(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల ఒక రైస్ మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య జరిగిన సంఘటన మరొక ముందే మండలంలో మరో సంఘటన చోటుచేసుకుంది.సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై వరుసకు తాత వరస అయ్యే వృద్ధుడు(70) మూడు రోజుల క్రితం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులకు ఆలస్యంగా జరిగిన విషయం తెలియజేయడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.