Monday, July 15, 2024
Homeతెలంగాణప్రపంచ దేశాలకు భారతీయ యోగా ఒక దిక్సూచి

ప్రపంచ దేశాలకు భారతీయ యోగా ఒక దిక్సూచి

ప్రపంచ దేశాలకు భారతీయ యోగా ఒక దిక్సూచి

వెలుగు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు  డాక్టర్ లెక్కల నగేష్

సుల్తానాబాద్,జూన్21(కలం శ్రీ న్యూస్):ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో డివిజన్ స్థాయి అధికారులకు, ఉద్యోగులకు వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యోగ శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా వెలుగు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ లెక్కల నగేష్ మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు మానసిక ఒత్తులు దూరమవుతాయని,ప్రపంచ దేశాలకు భారతీయ యోగా ఒక దిక్సూచిగా నిలిచిందని , ప్రపంచంలో ప్రతి దేశం యోగాను అనుసరిస్తున్నదని , ప్రతి ఒక్కరూ తమ దైనoధిక జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని ధ్యానం చేయాలని తద్వారా ఆనందకరముగా జీవించే అవకాశం ఉంటుందని తెలిపారు .

ఈ సమావేశంలో ఎస్.పి.ఎం రాజమౌళి,ఉద్యోగులు గణేష్, మూర్తి ,ఎండి సుల్తాన్, సమ్మయ్య , వెలుగు స్వచ్ఛంద సంస్థ సభ్యులు సల్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!