Monday, November 11, 2024
Homeతెలంగాణయోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు

సుల్తానాబాద్,జూన్21(కలం శ్రీ న్యూస్):

ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని మండల న్యాయ సేవ అధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి పట్టణానికి చెందిన యోగా మాష్టర్ యెల్లే మల్లేశం వివిధ యోగ ఆసనాలు నేర్పించి వ్యాయామం చేయించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా శరీరం లోని అన్ని అవయవాలకు వ్యాయామం జరుగుతుందని, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. యోగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా మాష్టర్ ఎల్లె మల్లేశం ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్ , ఎజీపీ మేకల తిరుపతి రెడ్డి, న్యాయవాదులు ఆకారపు సరోత్తం శ్రీరాములు, అవునూరీ సత్యనారాయణ, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, గజభీంకార్ గోపీనాథ్, కోర్టు సూపరింటెండెంట్ హరనాథ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!