నట్టల నివారణకు ఆల్బెండజోల్ (నులిపురుగులు ) మాత్రలు
మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు
సుల్తానాబాద్,జూన్20(కలం శ్రీ న్యూస్):నట్టల నివారణకు 02 నుండి 19 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ (నులిపురుగులు ) మాత్రలు తప్పనిసరిగా వేయించాలని మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాయమల్లు అన్నారు. గురువారం స్థానిక జూనియర్ కళాశాలలో వైద్య సిబ్బంది ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల పొట్టలో నులిపురుగులు చేరితే రక్తహీనత, పోషకాలలోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కట్ల వేణుమాధవ్, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సింధుజ, శ్రీజ, ఉదయ, జూనియర్ కళాశాల లెక్చరర్లు రత్నాకర్, మెహరాజ్, ఏఎన్ఎంలు శారద, రమ, సరస్వతి, ఆశ వర్కర్లు, కళాశాల సిబ్బంది విద్యార్థులతోపాటు పలువురు పాల్గొన్నారు.