Thursday, October 10, 2024
Homeతెలంగాణపొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీల భద్రత యజమానులదే: పెద్దపల్లి ఏసీపీ...

పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీల భద్రత యజమానులదే: పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ

పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీల భద్రత యజమానులదే: పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ

సుల్తానాబాద్,జూన్17(కలం శ్రీ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజీ)  ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని 110 రైస్ మిల్స్,  23 ఇటుక బట్టీల అసోసియేషన్ సభ్యులతో సుల్తానాబాద్ పట్టణం లోని నరహరి ఫంక్షన్ హల్ లో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ .. పొట్టకూటి కోసం వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే, ఇతర కూలీల భద్రత రైస్ మిల్స్, ఇటుక బట్టి యజమానులదే అన్నారు. ప్రతి రైస్ మిల్లు, ఇటుక బట్టీల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని,ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి కూలీలను తీసుకువచ్చిన్నపుడు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టార్ మైంటైన్ చేసి సంబంధిత శాఖ తెలపాలని,మగ కూలీలు, ఆడ కూలీలకు వేరువేరుగా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి కూలీల కి వేరుగా నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయాలని,రైస్ మిల్ , ఇటుక బట్టీల యజమానులు తమ వద్ద పనిచేసేటువంటి కూలీల యొక్క గత చరిత్రను తెలుసుకోని  చెడు అలవాట్లు ( మద్యం, గంజాయి డ్రగ్స్ )కలిగిన వారి వివరాలు సేకరించి వారిని పనిలో ఉంచుకోకుండా చూడాలని,రైస్ మిల్, ఇటుక బట్టి ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసుకొని రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఇన్-అవుట్ అయ్యే వారి వివరాలు పూర్తిగా నమోదు చేయాలని, రైస్ మిల్, ఇటుక బట్టీలలో కూలీల చేత వెట్టిచాకిరి చేయించ వద్దని, కార్మిక చట్టాలను ఖచ్చితంగాా పాటించాలన్నారు. వారికీ కనీస అవసరాలు అనగా త్రాగునీరు, సరైన వసతి, ఆసుపత్రిని ఏర్పాటు చేయక పోవడం, చిన్న చిన్న గదులలో వారి నివాసలల్తో ఇబ్బందులు పడకుండా కనీస ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రవణ్ కుమార్, రైస్ మిల్, ఇటుక బట్టీల యజమానులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!