ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు.
మానవాళి సుఖ శాంతుల కోసం ప్రత్యేక ప్రార్థనలు.
సుల్తానాబాద్, జూన్ 17(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణం లో ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. సోమవారం పట్టణంలోని అలంగీర్ మజీద్ ప్రక్కనే ఉన్న ఈద్గా లో ఈద్ అల్ అదహ పర్వదిన ప్రార్థనలు చేశారు.ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై నమాజు పూర్తి చేశారు.ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక దువా లో ప్రపంచ మానవాళి సుఖ శాంతుల తో జీవనం గడపాలని, విశ్వ ప్రజలందరికి సుఖ శాంతులతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరి కొకరు ఆ లింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పట్టణం లోని ప్రముఖులు బక్రీద్ పండుగ సందర్భంగా శుభకాంక్షలు తెలిపారు.