పదో తరగతిలో అత్యుత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులకు, తల్లితండ్రులకు సన్మానం.
రామగుండం,జూన్. 9 (కలం శ్రీ న్యూస్ ):పెద్దపెల్లి జిల్లా రామగుండం మండలం స్థానిక ఎఫ్ సిఐ లోని శ్రీమయి కన్వెన్షన్ ఏసీ హాల్ లో నిర్వహించిన అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో అత్యుత్తమ జిపిఏ తో ఉత్తీర్ణులు అయిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఆ పిల్లల తల్లితండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి కందుల సంధ్యారాణి. ఈ కార్యక్రమం లో సంధ్యారాణి మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు మన కోసం మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే నాన్న ఒకరైతే, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ, ప్రతి సంతోషంలోనూ తోడయ్యే అమ్మ ఇంకొకరు. ఎంత ఎత్తుకి ఎదిగినా నువ్వు ప్రపంచంలో అందరికీ తెలియకపోవచ్చు కానీ నిన్నే ప్రపంచంగా భావించే వాళ్లు తల్లితండ్రులు మాత్రమే విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు వాళ్ల తల్లితండ్రులతో కలిసి వచ్చిన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పిల్లలను తల్లితండ్రులను కలిపి శాలువా కప్పి, మెమోంటో ఇవ్వగా పిల్లలచే తల్లితండ్రులపై పూలు చల్లించి ఆశీర్వాదం తీసుకున్నారు పిల్లలు. ఈ కార్యక్రమంలో తల్లితండ్రుల కళ్ళు చెమ్మగిల్లగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇలాంటి విలువలు నేర్పే కార్యక్రమాలు చేయడం అమ్మతనం తెలిసిన నాయకురాలు కందుల సంధ్యారాణి కే తెలుసు తల్లితండ్రులు కొనియాడారు. ఈ రోజు కందుల సంధ్యారాణి పుట్టినరోజు కూడా కావడం వల్ల పిల్లలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య బీజేపీ మండల అధ్యక్షులు బాణాల స్వామి, కోడూరి రమేష్, నవీన్ గౌడ్, మిట్టపల్లి సతీష్, కొమ్ము గట్టయ్య, గుండబోయిన భూమయ్య, సీనియర్ నాయకులు తోట కుమారస్వామి, కోమల మహేష్, పైతరు రాజు, పార్లిమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్, కొమ్మల స్వామి, ప్రవీణ్, పద్మ, సాగర్, అపర్ణ, మనోహర, విజయ, నరేష్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.