Thursday, October 10, 2024
Homeతెలంగాణరాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గం

జూనియర్ సివిల్ జడ్జి రాణి

సుల్తానాబాద్,జూన్8(కలం శ్రీ న్యూస్):

రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు సమన్యాయం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు ఇంచార్జీ జూనియర్ సివిల్ జడ్జి కే.రాణి అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్ట్ ఆవరణలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రాణి మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన నేరాలకు కోర్టుల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసాలకు గురికాకుండా రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించు కోవచ్చునని, ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించబడ్డ కేసులలో ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందనీ అన్నారు. లోక్ అదాలత్ లో పరిష్కరించబడ్డ కేసులకు ఎలాంటి అప్పీల్ ఉండదని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ లో పలు క్రిమినల్, చెక్ బౌన్స్ , కుటుంబ తగాదాలు, ఆబ్కారీ శాఖ కేసులు, భార్యాభర్తల వివాదాల సంబంధించి 100 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పలువురు న్యాయవాదులు వివిధ చట్టాలపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, సిఐ సుబ్బారెడ్డి, జూలపల్లి, శ్రీరాంపూర్ ఎస్ఐ లు శ్రీధర్, ఓంకార్ యాదవ్, న్యాయవాదులు మాడూరి ఆంజనేయులు, బోయిని భూమయ్య, ఆవుల శివకృష్ణ సామల రాజేంద్రప్రసాద్, రుద్రారపు నరసయ్య, వడ్లకొండ రవి కిరణ్, బొబ్బిలి శ్యాం లతో పాటు కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!