Thursday, October 10, 2024
Homeతెలంగాణపద్మశాలి జిల్లా అడాక్ కమిటీ ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన 

పద్మశాలి జిల్లా అడాక్ కమిటీ ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన 

పద్మశాలి జిల్లా అడాక్ కమిటీ ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన 

సుల్తానాబాద్, జూన్ 6 (కలం శ్రీ న్యూస్ ): సుల్తానాబాద్ మండల కేంద్రంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవ సంఘం అడాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం స్థానిక శ్రీవాణి జూనియర్, పీజీ కళాశాలలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి దాదాపు 150 మందికి  ఎమర్జెన్సీ ఫిజీషియన్ డాక్టర్ ఎండీ వేముల సత్యనారాయణ, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిష్టారావు,డాక్టర్ల బృందం చికిత్సలు నిర్వహించారు. రక్త మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ, టుడికో పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి ఐల రమేష్, జిల్లా అడాక్ కమిటీ చైర్మన్ వల్స నీలయ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటుచేసిన క్యాంపులో వారు మాట్లాడుతూ పద్మశాలి జిల్లా అడాక్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు వైద్య సేవ అందించాలనే సంకల్పంతో క్యాంపు నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ స్థాయిలో అందించే వైద్యాన్ని గ్రామ స్థాయికి తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజలకు అందించాలనే సంకల్పంతోనే ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఆడెపు సుధాకర్, బత్తుల రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూర్ల లక్ష్మీనారాయణ, అడాక్ కమిటీ జిల్లా సభ్యులు పెగడ చందు, డి.వి.ఎస్ మూర్తి, పద్మశాలి సంఘం సభ్యులు కొండ సత్యనారాయణ, ఆడెపు అంబదాస్, పెగడ పరుశరాములు, దేవసాని లక్ష్మీపతి, గాదాసు రవీందర్, సామల రాజేంద్రప్రసాద్,సుంక శ్రీధర్, సుంక మహేష్ ఎల్లె రాజు, వైద్య సిబ్బంది, ప్రజలు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!