Monday, July 15, 2024
Homeతెలంగాణపెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

పెద్దపల్లి,జూన్2(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండే సమయంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. రోహిణి కార్తె ఎండల తీవ్రతను మొన్నటి వరకూ తట్టుకోలేని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. వడదెబ్బ తగిలి అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.అయితే ఈరోజు ఒక్కసారి పెద్దపల్లి లో భారీ వర్షం కురియడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మంథని, రామగుండం లో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఈదరుగాలులు, వర్షం ధాటికి అనే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు మండే ఎండల్లో కొంత సేదతీరేందుకు అవకాశం కలిగినట్లయింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!