అమర వీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం
సుల్తానాబాద్,జూన్2(కలం శ్రీ న్యూస్): ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం అని స్థానిక సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జాతీయ జెండావిష్కరణ చేసిన తరువాత పాఠశాల సిబ్బంది తో కలిసి జాతీయ గీతాలాపనతోపాటు, తెలంగాణ గీతం ఆలపించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట వీరులను స్మరించుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాఠశాల ఇంచార్జ్ కరస్పాండెంట్ ఫాదర్ జోసెఫ్ సిబ్బందికి, ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది అంజూ రాణీ,జే.స్వప్న, ప్రతిభ, స్వప్న, సంధ్య, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, రాకేష్, మాలిక్, సంపత్,రోహిత్(అభి),రాము,శ్రావణ్ లు పాల్గొన్నారు.