అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు
సుల్తానాబాద్, మే 18(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో శనివారం వాసవి మాత జయంతి, వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువ గా జరిగాయి.ఉదయం గణపతి పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి అభిషేకం, పెద్ద ఎత్తున హోమాలు,కుంకుమ పూజలు జరిగాయి. సాయంత్రం అమ్మవారి శోభాయాత్ర వేడుకలు ఘనంగా జరిగింది. అమ్మవారి ఊరేగింపు వాసవి మాత దేవాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా వేణుగోపాలస్వామి దేవాలయం నుండి వాసవి మాత దేవాలయం వరకు శోభయాత్ర జరిగింది. పూజారులు చంద్రశేఖర్ శర్మ , సంతోష్ శర్మ పలువురు పూజారులు పాల్గొని అమ్మవారి జయంతి, వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.