పోలియో చుక్కలు వేయించండి సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడండి
మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు
సుల్తానాబాద్,మార్చి03(కలం శ్రీ న్యూస్):- పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారి సంపూర్ణ ఆరోగ్యానికి సహకరించాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించి చిన్న పిల్లలకు చుక్కల మందు వేశారు. పిల్లల నిండు జీవితానికి రెండు చుక్కలు తోడ్పడతాయని కావున పిల్లలకు పోలియో చుక్కలు వేయించి,పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామన్నారు.ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పక వేయించి పిల్లలను పోలియోనుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఇంతకు ముందు వేయించినా వాటితో సంబంధం లేకుండా ఆదివారం తప్పక వేయించాలని గాజుల లక్ష్మి రాజమల్లు అన్నారు.పోలియో చుక్కలు మీ బిడ్డను అంగవైకల్యం నుండి కాపాడతాయని,మీరు రైల్లో,బస్సులో గాని ప్రయాణిస్తున్నా, మీరు ఎక్కడి వారైనా, వలస వచ్చిన వారైనా, మీ వార్డులకు మీ ప్రాంతానికి అందుబాటులో ఉన్న పోలియో కేంద్రానికి వెళ్లి పోలియో చుక్కలు తప్పక వేయించాలని సూచించారు. మీ దగ్గరలోని ఆశా, అంగన్వాడి, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని కోరారు.