ధూళికట్టలో బిఅర్ఎస్ పార్టీ లో చేరికల సునామి.
ఎలిగేడు,నవంబర్23(కలం శ్రీ న్యూస్): దూళికట్ట గ్రామానికి చెందిన యాదవ,ముదిరాజ్, గౌడ సంఘం, ఆటో యూనియన్ సంబంధించిన 300 మంది యువకులు, డ్రైవర్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గురువారం పార్టీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ కెసిఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలకు పెద్దపల్లి లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి లో మళ్ళీ గెలిచేది టిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అని, మనోహర్ రెడ్డి అత్యంత భారీ మెజార్టీతో గెలిచి పెద్దపల్లి ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గం గా, అన్ని విధాల అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, ఎలిగేడు మండల అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుధాకర్ రావు, కోఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్, దూళికట్ట గ్రామ అధ్యక్షులు మారం కొమురయ్య యాదవ్, సీనియర్ నాయకులు భూసారపు రమేష్ గౌడ్, బిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు