Thursday, October 10, 2024
Homeతెలంగాణప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి:సీఐ కర్ర జగదీష్

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి:సీఐ కర్ర జగదీష్

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి:సీఐ కర్ర జగదీష్

సుల్తానాబాద్, నవంబర్ 21 (కలం శ్రీ న్యూస్): చెక్ పోస్ట్ ల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించాలని సిఐ కర్ర జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని ఎస్సై విజేందర్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాల తనిఖీ ముమ్మరంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి అనుమానం వచ్చిన ఉపేక్షించేది లేదని, వాహనదారులు విధిగా తనిఖీ అధికారులకు సహకరించాలని అన్నారు.

ఎన్నికల సందర్భంగా డబ్బులు చేతులు మారే అవకాశాలు ఉన్నందున ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్నికల పోలింగ్ గదులను పరిశీలించారు. సిసి కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కు వినియోగించే కేంద్రాలను పరిశీలించారు. ఓట్లు వేసే అభ్యర్థులు కు అన్ని విధాల ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వికలాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుండే తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందని, కేంద్రాలకు వచ్చేవారికి ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ జగదీష్ వెంట పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!