రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ లో సత్తాచాటిన ఐపీఎస్ విద్యార్థులు
సుల్తానాబాద్,నవంబర్ 16 (కలం శ్రీ న్యూస్ ) : ఈనెల 13నుంచి 16 వరకు సికింద్రాబాద్ లో జరిగిన 10వ తెలంగాణ రాష్ట్రస్థాయి టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ క్రీడల్లో పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఉమెన్స్ విభాగంలో సిహెచ్ ఖుషి, ప్రియదర్శిని, పునీత, సంధ్య అత్యుత్తమ కనబర్చి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి కనబరిచి మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రాణించాలని,క్రీడల వల్ల శరీరానికి కావలసిన వ్యాయామం ఆరోగ్యం దృఢంగా ఏర్పడతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్ ,శివ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.