పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు
పెద్దపల్లి,జనవరి27,(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన పెనుకుల లక్ష్మీ – తిరుపతి ల కూతురు వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్ళి కూతురు లాస్య కు పెళ్ళీ చీర అందివ్వడం జరిగింది . ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత18 సంవత్సరాల నుండి పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవకార్యక్రమాలు చేస్తున్న అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్,బత్తిని కిట్టయ్య గౌడ్,మినుగు సమ్మయ్య,బొత్తి నర్సయ్య, కవ్వంపల్లి శేఖర్, ముంజపల్లి అరవింద్, చంచుల నాగరాజు, సంపత్, బత్తుల నగేష్, సబ్బు తిరుపతి, ఇరుకు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.