దళితుడి పై దాడి చేసిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ల నాగరాజు
పెద్దపల్లి,నవంబర్14(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలో గల దియా రెస్టారెంట్ లో పనిచేస్తున్న దళిత యువకుడు సోగాల ప్రశాంత్ పై మంగళవారం రాత్రి ఇనుప రాడ్లతో అతి కిరాతకముగా దాడి చేసిన వ్యక్తులపై వెంటనే ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో పోలీసులు వచ్చి గొడవను పక్కదారి పట్టించిన పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయాలని కోరారు. రామగిరి మండలంలో శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రజలకు అర్థమవుతుందని, మహారాష్ట్ర, రాయచూరు ప్రాంతాల నుండి గుర్తుతెలియనీ వ్యక్తులు సంచరించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దుండగులపై ఎస్సీ/ ఎస్టీ కేసు పెట్టాలని, లేనియెడల నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరుగుతుందని అన్నారు.