పద్మశాలి ఆడపడుచును అవమానించిన ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలి
భోగ శ్రావణి కి మద్దతుగా చలో జగిత్యాల 29 న
పద్మశాలి సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి
పెద్దపల్లి,జనవరి27,(కలం శ్రీ న్యూస్):
జగిత్యాల జిల్లాలో పద్మశాలి ముద్దుబిడ్డ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బీసీ నాయకురాలు భోగ శ్రావణి ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భోగ శ్రావణి ని అవమానిస్తూ, అభివృద్ధి పనులకు సహకరించక, మనస్థాపానికి గురి చేయటాన్ని దీన్ని మేము పూర్తి స్థాయిలో పెద్దపెల్లి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి లు తీవ్రంగా ఖండించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెంటనే పద్మశాలి ఆడపడుచు మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి కి క్షమాపణ చెప్పాలని, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగిత్యాల ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,కేటీఆర్ వెంటనే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటిఆర్ కు జగిత్యాల లో జరిగిన పరిణామాలు వాట్సాప్ ద్వారా తేలియపరచటం జరిగినదని అన్నారు. 29 న ఆదివారం రోజున భోగ శ్రావణి కి మద్దతుగా జగిత్యాలలోని పద్మశాలి భవన్ కు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారని పెద్దపెల్లి జిల్లాలోని ప్రతి పద్మశాలి జగిత్యాలకు తరలివచ్చి భోగ శ్రావణి అండగా నిలవాలని కోరారు.