Friday, September 20, 2024
Homeతెలంగాణశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల 

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల 

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్  

మంథని అక్టోబర్ 30( కలం శ్రీ న్యూస్):మంథని మండలం కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే రాం రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రు పట్ల సునీల్ రెడ్డి,ఎన్నికల ప్రచార రథానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం మంథని,కమాన్ పుర్ మండలాల మహిళ మోర్చా అధ్యక్షురాలు బొసెల్లి మౌనిక,అలుగు కృష్ణవేణి జెండాను ఊపి ప్రచార రథం ప్రారంభించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదంతో,ప్రజల ఆశీస్సులతో మంథనిలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని,అసమర్థ కాంగ్రెస్ కి , అవినీతి బిఆర్ఎస్ కి ఇంకా మంథనిలో మనుగడ లేదని,నవంబర్ 30 తారీకు రోజున కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించి,చరిత్ర సృష్టింస్తారని,గతంలో ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ మంథని ప్రాంతంలో ఒక బలమైన శక్తి ఆవిర్భరిస్తుంది, ఇద్దరి నాయకులను చూసి విరక్తి చెంది,ఒక కొత్త నాయకునికి, అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్చయించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, కొండపాక సత్య ప్రకాష్ జి,అసెంబ్లీ కన్వీనర్ మల్కామోహన్ రావ్,కో కన్వినర్ నాంపల్లి రమేష్,జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్,మండలాల అధ్యక్షులు,విరబోయిన రాజేందర్, పెయ్యాల కుమార్,జంగపల్లి అజయ్,బిఎస్ స్ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, ఇంచార్జ్ లు మచ్చగిరి రాము,ఎడ్ల సదశివ్, తోట మధుకర్,సబ్బాని సంతోష్,సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!