బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వైస్ ఎంపిపి బుర్ర వీరాస్వామి గౌడ్
ఎలిగేడు,అక్టోబర్24(కలం శ్రీ న్యూస్):గత 13 సంవత్సరాలుగా ఆనాటి టిఆర్ఎస్, నేటి బిఆర్ఎస్ పార్టీకి ఎన్నో సేవలందించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి గౌడ్ బిఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటన తెలిపారు. తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షునికి మండల అధ్యక్షుడికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు రాజకీయం రెండు, మూడు రోజుల్లో వివరించునట్లు ఆయన తెలిపారు.