గులాబీ జెండాను వీడిన కీలక నేతలు
ఎన్నికల ముందు కారుకు కోలుకొని దెబ్బ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 15 (కలం శ్రీ న్యూస్):మంథని మండల ఎంపీపీ,వైస్ ఎంపీపీ,ఎంపిటిసి లు , గ్రామ సర్పంచులు,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, వార్డు మెంబర్ లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారిని పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్లో మంథని నియోజకవర్గంలోని మంథని మండలానికి సంబంధించిన మంథని ఎంపీపీ కొండా శంకర్, వైస్ ఎంపీపీ స్వరూప్ రెడ్డి, ఎక్లాస్ పూర్ ఎంపీటీసీ పెండ్లి ప్రభాకర్ రెడ్డి, చిల్లపల్లి ఎంపీటీసీ గుమ్మడి రాజయ్య, ఉప్పట్ల ఎంపీటీసీ బడికెల దేవక్క లింగయ్య, సిరిపురం ఎంపీటీసీ గుమ్మడి సత్యవతి రాజయ్య, పోతారం సర్పంచ్ జాగిరి స్వప్న సదానందం, పోతారం గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల నరసన్న,జిల్లా వార్డ్ మెంబర్లు ఫోరం అధ్యక్షుడు ఎడ్ల మధుకర్,సూర్య సాగర్వార్డు మెంబర్ పోతరం,ఉప్పుల రాకేష్ వార్డ్ మెంబర్ లు మచ్చినేని రాజేంద్రప్రసాద్ పోతరాo రైతు సమన్వయ సమితి అద్యక్షుడు, సిద్ధం రమేష్ బీసీ సెల్ అధ్యక్షుడు అరేంద,వార్డ్ మెంబర్ అరెంద లక్కిరెడ్డి స్వామి,రాజాబాపు వార్డు మెంబర్,దామరపల్లి నిహారిక సుదర్శన్ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ సెక్రెటరీ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.