Thursday, September 19, 2024
Homeతెలంగాణరైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.

సామాజిక కార్యకర్త పులి రాజు 

మంథని,రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 14(కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ 32,సంగీత29 ఆత్మహత్య చేసుకున్న యువ రైతు దంపతుల కుటుంబాన్ని శనివారం సామాజిక కార్యకర్త పులి రాజు పరామర్శించి ప్రభుత్వమే అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. తేదీ 10-10- 2023 రోజున ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని అందులో వరి,పత్తి వేసుకుంటూ జీవిస్తున్నారు.గత రెండు,మూడు సంవత్సరాలగా సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో పంట మునిగిపోవడంతో అప్పులు భారమై అప్పులు తీర్చే మార్గం లేక పత్తి చేనుకు తెచ్చిన పురుగుల మందును రాత్రి తన ఇంట్లో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి కొడుకు సాయి కృష్ణ 5 సంవత్సరాలు,బిడ్డ సన 4 సంవత్సరాల వయస్సు పిల్లలు ఉన్నారు. ఈ దంపతుల పేరు మీద ఎలాంటి భూమి లేకపోవడంతో వీరికి రైతు బీమా రాదు కాబట్టి ఈ కుటుంబానికి 421 జీవో ప్రకారం ఆరు లక్షల రూపాయలతో పాటు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మరియు పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్ చేర్పించి చదివించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!