వివేకానంద పాఠశాలలో ఘనంగా పిల్లలతో అక్షరాభ్యాసం
సుల్తానాబాద్, జనవరి 26( కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ వివేకానంద పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వసంత పంచమి సందర్భంగా ఏర్పాటుచేసిన అక్షరాభ్యాసానికి పిల్లలు, తల్లిదండ్రులు హాజరై పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద పాఠశాల వ్యవస్థాపకులు భూసారపు బాలకృష్ణ ప్రసాద్, డైరెక్టర్ రవీందర్, కరస్పాండెంట్ సుజాత ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపారమైన జ్ఞానం లభిస్తుంది నిరాటకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ఈరోజు ఏర్పాటు చేసిన వివేకానంద పాఠశాలల్లో పిల్లలతో అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్ చందు, ఉపాధ్యాయులు, ఆధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.