దళితుల హక్కులకై నా పోరాటం..
ఆర్ల నాగరాజు, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
మంథని,సెప్టెంబర్24(కలం శ్రీ న్యూస్):రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి దళితుల హక్కులకై పోరాటలు చెయ్యడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ల నాగరాజు అన్నారు.ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ దళితులకి ఏక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుండి పోరాడటానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరుగుతుందనీ, ఈ మధ్యకాలంలోనే ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను,జాతీయ మానవహక్కుల కమిషన్ , జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిసి దళితుల సమస్యలను వివరించడం జరిగిందని తెలిపారు. దళితులు ఎవరైనా సమస్యలు ఉంటే ప్రత్యక్షంగా నన్ను కలవవచ్చని, ఏ రాజకీయ పార్టీ తో అనుబంధం లేకుండా పనిచేయడం జరుగుతుందని, అదేవిధంగా గుజరాత్ ఎమ్మెల్యే , దళిత ఉద్యమ జాతీయ నాయకుడు జిగ్నేష్ మెహ్వాన్ ను కూడా ఢిల్లీలో కలవడం జరిగిందని,ఇకనుండి దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ ఉద్యమాలు పోరాటం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.