వినాయక చవితి ఉత్సవాలలో డీజేలను వాడినట్లైతే కఠిన చర్యలు ::సుల్తానాబాద్ సీఐ జగదీశ్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 22(కలం శ్రీ న్యూస్);వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ సీఐ జగదీశ్ డీజే నిర్వాహకులకు హెచ్చరించారు. సుల్తానాబాద్ సర్కిల్ లో నాలుగు పోలీస్ స్టేషన్ డీజే నిర్వాహకులను శుక్రవారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలలో డీజేలను నిషేధించడం జరిగిందని నిర్వాహకులకు సీఐ వివరించారు. ఎక్కడైనా డీజేలు నిర్వహించినట్లు కనిపించినట్లయితే కఠిన చర్యలతో పాటు, డిజెలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ముందస్తు చర్యలలో భాగంగా డిజె నిర్వాహకులను తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమం లో సుల్తానాబాద్ ఎస్ ఐ, పోత్కపల్లి ఎస్ ఐ, జూలపల్లి ఎస్ ఐ, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.