నిరుపేద మైనార్టీ ల105 వ జంట కు వివాహం….
అండగా నిలిచిన పెద్దపల్లి జిల్లా జాగృతి అధ్యక్షులు, ఆసరా ఫౌండేషన్ అధ్యక్షుడు పెంట రాజేష్
పెద్దపల్లి,జనవరి25,(కలం శ్రీ న్యూస్):
కుల మతాలకు అతీతంగా నిరుపేద కుటుంబానికి మైనార్టీ జంటకు ఆసరా ఫౌండేషన్ అధ్యక్షుడు పెంట రాజేష్ అండగా నిలిచాడు . జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో 105వ జంట సంరిన్, మహమ్మద్ పసియోద్దీన్ కు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివాహం జరిపించారు . వివాహ అనంతరం ఆసరా ఫౌండేషన్ అధ్యక్షుడు, జాగృతి జిల్లా అధ్యక్షుడు పెంట రాజేష్ మాట్లాడుతూ పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు వివాహం చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు అండగా ఆసర పౌండేషన్ నిలిచి అన్నీ తామై వివాహం చేయించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపడమే ఆసరా పౌండేషన్ లక్షమని అన్నారు.అయితే ప్రేమ వివాహాలు కాకుండా పెద్దలు సమక్షంలో కుదుర్చుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద జంటలకు మాత్రమే వివాహం చేయుటకు తాము ముందుంటామన్నారు.ఒక బాద్యతా యుత మైన పౌరినిగా సామాజిక సేవలో భాగంగా రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివాహానంతరం బంధువులు,అతిథులకు భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మోహన్ జి, దిలీప్ కత్రి, తూముల శీను, రాజు యాదవ్, జొన్నల రవి, రమేష్, పులి కొమురయ్య, శరత్ మోహన్,