మంథని తహసిల్దార్ కు సమ్మె నోటిసు అందజేత
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 5(కలం శ్రీ న్యూస్ ):అంగన్వాడి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 11 తేదీ నుండి సిఐటియు,ఏఐటీయూసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం మంథని తహసిల్దార్ కు సమ్మె నోటీసును అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని గ్రాడ్యూటీ అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు ఇతర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమ్మెలో మంథని ప్రాంతం నుండి అంగన్వాడీలు పాల్గొనాలని అంగన్వాడీల న్యాయ పోరాటానికి ప్రజానీకం మద్దతుగా నిలవాలని ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు సుగుణ,సునీత,వరుణ, రాజమ్మ,అంగన్వాడీలు పాల్గొన్నారు.