బీసీల సింహగర్జనను విజయవంతం చేయండి
పోస్టర్ ఆవిష్కరణలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 3 (కలం శ్రీ న్యూస్ ): సామాజిక న్యాయం,సబ్బండ వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా నిర్వహించే బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహాలో బీసీల సింహగర్జన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు మనదే సీటు మనదే అనే నినాదంతో హైదరాబాద్ ఎల్బీనగర్‌లో బీసీ సంక్షేమ సంఘం,బీసీ కులాల జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల10న నిర్వహించే సింహగర్జనకు నియోజకవర్గంలోని బీసీలు, సబ్బండ వర్గాలు బారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.