Wednesday, December 4, 2024
Homeతెలంగాణమణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నాయకులు

మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నాయకులు

మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నాయకులు

ఎండపల్లి ,జులై26(కలం శ్రీ న్యూస్):మణిపూర్ లో జరుగుతున్న మారణకాండ కు నిరసనగా సిపిఎం పార్టీ పిలుపుమేరకు సిపిఎం సంఘాల ప్రజా పార్టీల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ఎండపల్లి తహశీల్దారు కార్యాలయం ముందర బుధవారం రోజున నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మణిపూర్ లో ఉండే మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసి తీవ్రంగా హింసల గురిచేయడం.బిజెపి గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోందని.అక్కడి పోలీసుల ముందర దౌర్జన్యాలు జరుగుతుంటే,ఆరు చర్చిలను తగలబెట్టి హింసకు గురి చేసిన ప్రభుత్వం పట్టించుకోకుండ చోద్యం చూస్తుందని వారు విమర్శించారు.ఇలాంటి దుర్మార్గమైన పాలన నిర్వహిస్తున్న బిజెపి పార్టీ,అలాగే ప్రధానమంత్రి కూడా ఆ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ కు తగిన చర్యలు తీసుకోకుండా,పార్లమెంట్లో 36 సెకండ్లు మాత్రమే మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు.ఆ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండను ఏమాత్రం కేంద్రం పట్టించుకోకుండా తమాషా చూస్తుందని. ఇలాంటి ప్రమాద పాలనను ఎదిరించడానికి, నిలువరించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని.ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం ఆగదని, అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతిని నెలకొల్పి,వాళ్లకు సరైన ఏర్పాట్లు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికి జరుగుతున్న మరణకాండను ఆపించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని సిపిఎం పార్టీ తరఫున బిజెపి గవర్నమెంట్ ను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు భూధం సారంగపాణి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాయిని శారద,పాస్టర్లు సుధాకర్,అనంతరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మైనా,వ్యవసాయ కార్మిక సంఘంకమిటీ సభ్యులు సుజాత,చొప్పదండి మొగిలి, కొండా శ్రీనివాస్,అమూల్య,ఆనే శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!