పోగొట్టుకున్న ఫోన్ ను బాధితునికి అప్పగించిన జూలపల్లి ఎస్సై
జూలపల్లి,జులై19(కలం శ్రీ న్యూస్): పోగొట్టుకున్న ఫోన్ ని సి.ఈ.ఐ.అర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితునికి అప్పగించిన జూలపల్లి ఎస్సై వెంకట కృష్ణ. వివరాలలోకి వెళితే గుర్రం విష్ణు ప్రసాద్ అనే ఎలిగేడు గ్రామస్థుడు తన యొక్క మొబైల్ ఫోన్ ను ఎలిగేడు నుండి జూలపల్లి కి వచ్చేమార్గం లో ఎక్కడో పడవేసుకుని అట్టి విషయాన్ని జూలపల్లి పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేయగా పోలీసువారు సిఈఐఆర్( CEIR )పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని కేవలం నాలుగు రోజుల్లో గుర్తించి ఈరోజు బాధితునికి ఎస్సై వెంకట కృష్ణ ధ్వారా అందజేయనైనది. పోయిన తన మొబైల్ ను ను గుర్తించి అప్పగించినందుకు బాధితుడు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపినాడు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట కృష్ణ మాట్లాడుతూ ఎవరైనా వారి యొక్క సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోగలరని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశంని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరని సూచించనైనది.