నేటి నుంచి రైతు బీమా పథకం దరఖాస్తులు ప్రారంభం ; ఏఈఓ వినోద్
ఎండపల్లి రిపోర్టర్/ శ్రీకాంత్ గౌడ్
జూలై 11 (కలం శ్రీ న్యూస్):పట్టా పాస్ బుక్కులు వచ్చి ఇప్పటివరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని గొడిసెలపేట ఏఈఓ వినోద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 59 ఏళ్ళ వయస్సు ఉన్న వారు అర్హులని అన్నారు. రైతులు దరఖాస్తు చేసుకోడానికి కావలసినవి,అప్లికేషను ఫారం, ,భూమి పాస్ బుక్,రైతు ఆధార్,నామిని ఆధార్,ఫోన్ నంబర్ ,తప్పనిసరిగా రైతే వచ్చి స్వయంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.అలాగే ఇదివరకు రైతు బీమా చేయించుకున్న రైతులు ఆధార్ కార్డులు ఏమైనా మార్పులు ఉన్నా, లేదా నామిని పేరు మార్చాలనుకున్నా తమ క్లస్టర్ పరిధిలోని ఏఈఓను సంప్రదించాలని సూచించారు.