Wednesday, December 4, 2024
Homeతెలంగాణవసంత పంచమి సందర్భంగాఈ నెల 26న అక్షరాభ్యాసం.

వసంత పంచమి సందర్భంగాఈ నెల 26న అక్షరాభ్యాసం.

వసంత పంచమి సందర్భంగాఈ నెల 26న అక్షరాభ్యాసం

వివేకానంద పాఠశాల వ్యవస్థాపకులు బాలకృష్ణ ప్రసాద్

సుల్తానాబాద్,జనవరి24,(కలం శ్రీ):

సుల్తానాబాద్ వివేకానంద పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా 26వ తేదీ గురువారం రోజున పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటలకి పిల్లలకు అక్షరాభ్యాసం చేపించబడునని వివేకానంద పాఠశాల వ్యవస్థాపకులు భూసారపు బాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షరాభ్యాసం చేయించుకునేందుకు వివేకానంద పాఠశాలలో 26వ తేదీన ఉదయం 8 గంటలకి పిల్లలను తీసుకొని రావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ భూసారపు రవీందర్, కరస్పాండెంట్ సుజాత, ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!