Wednesday, September 18, 2024
Homeతెలంగాణపోచమ్మ తల్లి బోనమెత్తిన చిన్నారి సుంక సహస్ర

పోచమ్మ తల్లి బోనమెత్తిన చిన్నారి సుంక సహస్ర

పోచమ్మ తల్లి బోనమెత్తిన చిన్నారి సుంక సహస్ర

ఎలిగేడు జూలై 9 (కలం శ్రీ న్యూస్):

ఆషాడ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ ,టీ.డబ్ల్యూ.జె.ఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ కూతురు చిన్నారి సుంక సహస్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదివారం నర్సాపూర్ గ్రామపోచమ్మ తల్లి బోనం ఎత్తి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు సమర్పించుకుంది. ఈ సందర్భంగా సుంక సహస్ర గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని, ఊరు, వాడలను సల్లంగ సూడు తల్లీ అని ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించి కోరుకుంది. ఈ కార్యక్రమంలో సత్యమ్మ, వాసవి ,సాయి సత్యక్, శ్యామ్, రమ్య ,రుత్విక్ సాయి,అన్విత్ సాయి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!