మంథని బీజేపి పార్టీ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 28 ( కలం శ్రీ న్యూస్):మంథని నుండి 1957 -78 వరకు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు.1971 నుండి 73 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిbఅనంతరం మన భారతదేశానికి సేవలందించిన మొట్టమొదటి తెలుగు జాతి ముద్దుబిడ్డ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా బుధవారం మంథని పట్టణంలోని పీవీ నరసింహారావు విగ్రహానికి బీజేపీ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి మాట్లాడుతూ మంథని నియోజకవర్గ రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో ఆయన పేరుతో మంథని జిల్లా ఏర్పాటు చేయడంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు విఫలమయ్యారని ఆయన ఆశయాలను కొనసాగించడంలో మన మంథని ప్రాంత బిడ్డగా ఆయనకిచ్చిన గౌరవం ఇదేనా ? అని కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులను సూటిగా ప్రశ్నించారు.అదేవిధంగా పీవీ నరసింహారావు మన నియోజకవర్గం నుండి న్యాయ సమాచార శాఖ దేవాదాయశాఖ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగి ముఖ్యమంత్రిగా ఉండి అనేక భూ సంస్కరణలు అమలుపరిచాడు.మన దేశంలో పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన అభివృద్ధి చెందే విధంగా వ్యవస్థలను తయారుచేసిన పివి ని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశం ఆయన సేవలను కొనియాడిందని అన్నారు.ఆయన ఆశయ సాధనలను కొనసాగించాలని భారతదేశంలో పివి ఆశయ సాధనలను అమలుపరిచేది కేవలం భారతీయ జనతా పార్టీ అని రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా రానున్నది బిజెపి ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్,ముత్తారం మండల ఇంచార్జ్ పోతరవేని క్రాంతికుమార్, సీనియర్ నాయకులు ఎడ్ల సదాశివ్,రాపర్తి సంతోష్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కాసిపేట మల్లేష్ ,ఎస్ స్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య,రవి తదితరులు పాల్గొన్నారు.