ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరులు చేసిన ప్రాణత్యాగాలు మరవలేనివి.
జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
పెద్దపల్లి, జూన్ 22(కలం శ్రీ న్యూస్):ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరులు చేసిన ప్రాణత్యాగం మరవలేనిదని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తెలంగాణ సాధనలో అమరులైన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 21 వ రోజు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి,అమరుల సంస్మరణ తీర్మానం చేశామన్నారు.అమరుల త్యాగాలు వెలకట్టలేమని,వారి ప్రాణ త్యాగ ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రంలో వారి ఆశయ సాధన దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ స్పూర్తితో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ. శ్రీనివాస్,జెడ్పీటీసీలు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.