అంబేద్కర్ చెరువు ఆధునీకరణతో కొత్త శోభ
జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్):గత పాలకుల హయాంలో మురికికూపంలా మారిన అంబేద్కర్‌నగర్ చెరువు ఆధునీకరణతో మంథనికి కొత్త శోభ సంతరించుకుంటుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.గురువారం అంబేద్కర్ చెరువును ఆయన పరిశీలించి ఆధునీకరణ పనులను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా అయిన వెంటనే అంబేద్కర్ చెరువును శుభ్రం చేయించామని తెలిపారు. ఈనాడు పూర్తిస్థాయిలో అంబేద్కర్‌చెరువును ఆధునీకరించి చెరువు మధ్యలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.మంథని పట్టణ ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని, పట్టణ నడిబొడ్డున ఉన్న రావులచెరువు,తమ్మి చెరువులు ఏ రకంగా ఆధునీకరించబడుతున్నాయో అదే రీతిలో అంబేద్కర్ చెరువును ఆధుకరించి అందరికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.బన్నె చెరువు నుంచి పైప్‌లైన్ ద్వారా అంబేద్కర్ చెరువులోకి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ ఉన్నారు.