దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలే
సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని మే 1(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదూకర్ సూచించారు.దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంథని మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఐదు రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా వివిద కార్యక్రమాల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసిందని,ఆ ఆదేశాల మేరకు ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని ఆయన అన్నారు. ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేలా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిదులు సమన్వయంతో దశాబ్ది ఉత్సవాలను సక్సెస్ చేయాలన్నారు. కార్యక్రమాల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఆయా మండలాల్లో నిర్వహించే కార్యక్రమాలు, వేడుకలను తాను హజరవుతానని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు,పొరపాట్లు జరుగకుండా ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన సూచించారు.